అఘోర పాత్రపై దృష్టిపెట్టిన బాలకృష్ణ!
- బోయపాటితో బాలకృష్ణ మూడో సినిమా
- కవల సోదరులుగా కనిపించనున్న బాలకృష్ణ
- లాక్ డౌన్ ముగియగానే షూటింగ్ మొదలు
రాయలసీమ పౌరుషాన్ని చాటే పాత్రలను గతంలో బాలకృష్ణ రక్తి కట్టించే వున్నారు. అఘోర పాత్రలో కనిపించనుండటం మాత్రం ఇదే మొదటిసారి. అందువలన ఆయన అఘోరాల తీరు తెన్నులు .. వాళ్ల వేషధారణ .. ప్రవర్తించే తీరు .. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా వుంటుందనే విషయాలను బాలకృష్ణ పరిశీలిస్తున్నారట.
వాళ్ల జీవన శైలిపై పూర్తి అవగాహన కోసం అందుకు సంబంధించిన పుస్తకాలను కూడా బాలకృష్ణ చదువుతున్నారని అంటున్నారు. ఈ పాత్ర బాలకృష్ణ కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.