హీరో, హీరోయిన్లతో పాటు అందరూ పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే: సురేష్ బాబు
- కరోనా ప్రభావం సినీ రంగంపై ఇంకొంత కాలం ఉంటుంది
- పెద్ద సినిమాలు ఎక్కువ ఇబ్బంది పడతాయి
- కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇబ్బందులు తప్పవు
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇబ్బందులు తప్పవని సురేశ్ బాబు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగే అవకాశం ఉందని... సాయంత్రం వరకు ఇంట్లో ఉండి పని చేసినవారు... సాయంత్రాలు రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అడుగులేస్తూ ముందుకు సాగాలని... లేకపోతే ప్రపంచమే నిలబడిపోయే ప్రమాదం ఉందని అన్నారు.