ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను: నటుడు హర్షవర్ధన్
- ఒక దశలో బాగా లావైపోయాను
- ప్రతి రోజు జిమ్ కి వెళ్లడం మొదలెట్టాను
- హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయేదన్న హర్ష
తెల్లవారు జామున ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయేది. పల్స్ రేట్ పెరిగిపోతున్నటుగా అనిపించేది. కంగారు పడిపోయి హాస్పిటల్ కి వెళితే, అంతా నార్మల్ గా ఉందని చెప్పేవారు. తరచూ అలాగే జరుగుతోంది .. సమస్య తగ్గలేదు. దాంతో ఈ నరకం భరించడం నా వల్ల కాదని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాంటి పరిస్థితుల్లోనే నా సన్నిహితుడు సుధాకర్ బాబుగారు, నా దినచర్య ను గురించి అడిగి తెలుసుకున్నారు. నా సమస్యకి ప్రధాన కారణం వాటర్ తక్కువగా తాగడమేనని చెప్పారు. అప్పుడు గానీ నేను ఆ సమస్య నుంచి బయటపడలేదు" అని చెప్పుకొచ్చాడు.