ఉదయ్ కిరణ్ ఉండుంటే ఇంకా మంచి హీరో అయ్యేవాడు: దర్శకుడు వీఎన్ ఆదిత్య
- ఉదయ్ కిరణ్ మంచి హీరో
- ఎమోషన్స్ బాగా పండించేవాడు
- ఇప్పుడు ఆయన ఉంటే బాగుండేదన్న వీఎన్ ఆదిత్య
తాజా ఇంటర్వ్యూలో వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావించారు. "ఉదయ్ కిరణ్ ఆ రోజున ఆ తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే, ఇప్పుడు ఇంకా మంచి హీరోగా ఉండేవాడు. ఫ్యామిలీ స్టోరీస్ కి ఉదయ కిరణ్ బాగా పనికొస్తాడు. ఎమోషన్స్ తో కూడిన డ్రామాను పండించడమెలాగో ఆయనకి తెలుసు. ఆ తరహా కథలను తయారు చేసుకున్న దర్శక నిర్మాతలకు ఉదయ్ కిరణ్ ఇప్పుడు మంచి ఆప్షన్ అయ్యుండేవాడు. ప్రేక్షకులచే అంతగా ఆదరించబడిన ఆయన ఇప్పుడు ఉండుంటే ఇంకా మంచి హీరో అయ్యుండేవాడు" అని చెప్పుకొచ్చారు.