'లూసిఫర్' తెలుగు రీమేక్ లో బన్నీ లేనట్టే!
- మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
- తెలుగు రీమేక్ దిశగా ప్రయత్నాలు
- స్క్రిప్ట్ పరంగా మొదలైన కసరత్తు
మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' ను తెలుగులో చిరంజీవి చేయనున్నాడు. ఈ సినిమాకి దర్శకుడిగా సుజీత్ పేరు వినిపిస్తుండగా, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నమ్మిన బంటు పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. తెలుగులో ఆ పాత్రకి అల్లు అర్జున్ అయితే బాగుంటుందనే మాట మెగా క్యాంప్ లో వినిపిస్తోందంటూ ఒక టాక్ వచ్చింది. బన్నీ కూడా ఆసక్తిని చూపుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదనేది బన్నీ సన్నిహిత వర్గాల మాటగా తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ ఎలాంటి పాత్ర చేయడం లేదని అంటున్నారు.