సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజతో మరోసారి త్రిష జోడీ
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రద్ధా కపూర్
- నాగశౌర్య తాజా ప్రాజక్ట్
* మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మహేశ్ సరసన చేయడానికి ఆమె కూడా ఆసక్తి చూపుతోందని, ప్రస్తుతం డేట్స్ సర్దుబాటు చేసే ప్రయత్నంలో వుందని అంటున్నారు.
* యంగ్ హీరో నాగశౌర్య తన తదుపరి చిత్రాన్ని 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేం సాగర్ చంద్ర దర్శకత్వంలో చేయనున్నాడు. సాగర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.