బాలయ్య సరసన కొత్త హీరోయిన్: బోయపాటి
- బాలకృష్ణతో బోయపాటి మూడో సినిమా
- రెండు డిఫరెంట్ లుక్స్ తో బాలయ్య
- శ్రియ, అంజలిల ఎంపికపై క్లారిటీ ఇవ్వని బోయపాటి
బాలకృష్ణ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్లను అనుకుంటున్నామనీ, అందులో ఒకరి పేరును సరైన సమయం చూసి ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం హీరోయిన్స్ దొరక్క తాము చాలా ఇబ్బందులు పడినట్టుగా వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఇక ఈ సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పారేగానీ, శ్రియ - అంజలి ఉన్నారా? లేరా? అనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.