కరోనా నేపథ్యంలో.. సేవ్ ద వరల్డ్’ అంటూ కోటి నుంచి మరో పాట!
- కొడుకుతో కలిసి స్వరపరిచి, ఆలపించిన కోటి
- లిరిక్స్ అందించిన శ్రీనివాస మౌళి
- ప్రకృతిని కాపాడుకోవడంపై చైతన్య పరిచే ప్రయత్నం
కోటి ఇప్పుడు మరో పాట కూడా రూపొందించారు. ‘సేవ్ ద వరల్డ్’ అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట ద్వారా ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. శ్రీనివాస మౌళి ఈ పాటను రచించారు. కొడుకు రోషన్తో కలిసి స్వర పరిచిన కోటి.. ఈ పాటను ఆలపించారు. ప్లాస్టిక్ వాడకం, అడవులు నరకడం, కాలుష్యం వల్ల నష్టాలను వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేశారు.