బాలీవుడ్ లో కలకలం... నటి జోయాకు కూడా కరోనా పాజిటివ్
- కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోయా మోరానీ
- నిన్ననే ఆమె అక్క షాజాకు పాజిటివ్ అని నిర్ధారణ
- కరీమ్ మోరానీ దంపతుల రిపోర్టులు రావాల్సి ఉంది
జోయా మోరానీ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె అక్క ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వీరి తల్లిదండ్రులు (కరీమ్ మోరానీ దంపతులు) కూడా టెస్టులు చేయించుకున్నారు. అయితే, వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్'ను కరీమ్ మోరానీ నిర్మించారు.