కొత్త హీరోతో త్రివిక్రమ్ మూవీ .. పారితోషికం 35 కోట్లు?
- ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ
- తరువాత ప్రాజెక్టు లైన్లో
- 170 కోట్ల బడ్జెట్ తో మరో సినిమా
ఒక వ్యాపార వేత్త తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి రంగంలోకి దిగాడట. 170 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కు పారితోషికంగా 35 కోట్లు ముట్టనున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ తరువాత చరణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయవలసి వుంది. ఆ ప్రాజెక్టు ఆలస్యమైతే త్రివిక్రమ్ ఈ కొత్త కుర్రాడితో సినిమా చేస్తాడట. లేదంటే చరణ్ ప్రాజెక్టు పూర్తయిన తరువాతనే చేస్తాడని చెబుతున్నారు.