సుకుమార్ అనుకున్న రిలీజ్ డేట్!
- బన్నీ హీరోగా సుకుమార్ మూవీ
- ప్రతినాయక పాత్రలో విజయ్ సేతుపతి
- వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల
ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా షూటింగుకి వెళ్లడం ఆలస్యమవుతోంది. దాంతో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. సహజంగానే సుకుమార్ తన ప్రాజెక్టులకి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందువల్లనే ఆయన ఈ రిలీజ్ డేట్ సెట్ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్న సంగతి తెలిసిందే.