అల్లు అర్జున్ పుట్టిన రోజున ఫస్టులుక్
- స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
- లారీ డ్రైవర్ గా కనిపించనున్న బన్నీ
- పూర్తయిన ఫొటో షూట్
ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి బన్నీ ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఫొటో షూట్ ను పూర్తి చేసిన సుకుమార్, ఫస్టులుక్ పైనే కసరత్తు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా మాస్ లుక్ తో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.