ఇలాంటప్పుడు మన దేశానికి తిరిగి రావడం ఇష్టం లేక ఇటలీలోనే ఉండిపోయా: సింగర్ శ్వేతా పండిట్
- కొన్ని రోజులుగా స్వీయ నిర్భంధంలో ఉండిపోయా
- ప్రతిరోజూ అంబులెన్స్ ల సైరన్లతోనే నాకు మెలకువ వస్తోంది
- హోలీకి మన దేశానికి వద్దామనుకున్నా, కానీ రాలేకపోయా
ఇటలీలో ఉన్న తనకు ప్రతిరోజూ అంబులెన్స్ ల సైరన్లతోనే మెలకువ వస్తోందంటూ అక్కడి పరిస్థితి ఎలా ఉందో గుర్తుచేసింది. ఈ మహమ్మారి గురించి ఇటలీ వాసులు కళ్లు తెరిచేలోపే విజృంభించేసిందని చెప్పింది. అసలు హోలీ పండగకు మన దేశంలోనే ఉందామనుకున్నాను కానీ, ఈ లోపే పరిస్థితులు మారిపోయాయని, ఇలాంటి పరిస్థితిలో మన దేశానికి తిరిగి రావడం తనకు ఇష్టం లేకనే ఒంటరిగా ఉండిపోయానని చెప్పిన శ్వేతా పండిట్, ‘కరోనా’ నియంత్రణకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గుర్తుచేసింది.