హద్దులు దాటే హెబ్బా ఐటమ్ సాంగ్!
- కిషోర్ తిరుమల నుంచి 'రెడ్'
- ఐటెమ్ సాంగులో మెరవనున్న హెబ్బా
- రామ్ సరసన ముగ్గురు నాయికలు
ఇటీవల రామ్ - హెబ్బా పటేల్ కాంబినేషన్లో ఒక ఐటెమ్ సాంగును హైదరాబాదు - రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈ ఐటెమ్ సాంగులో అందాలు ఆరబోయడానికి హెబ్బా పటేల్ ఎంతమాత్రం మొహమాట పడలేదట. హద్దులు దాటేసి ఆమె ఒలకబోసిన వయ్యారాలు యూత్ ను ఒక ఊపు ఊపేస్తాయని అంటున్నారు. ఈ ఐటెమ్ సాంగ్ బయటికి వచ్చిన తరువాత, ఈ తరహా సాంగ్స్ కి హెబ్బా కేరాఫ్ అడ్రెస్ గా మారిపోతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన మాళవిక శర్మ .. నివేద పేతురాజ్ .. అమృత అయ్యర్ అలరించనున్నారు.