లవర్ మోసం చేశాడని... అమలాపురం ఎన్నికల్లో అతనిపైనే పోటీకి దిగిన రేణుక!
- తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఘటన
- ఇంటింటికీ తిరిగి నాకు జరిగిన అన్యాయం గురించి చెబుతా
- నామినేషన్ అనంతరం రేణుక
ఈ విషయాన్ని పెద్దలు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా తనకు న్యాయం జరగలేదని అంటున్న రేణుక, తన తల్లితో కలిసి వచ్చి, సదరు నేత కుమారుడు బరిలోకి దిగిన వార్డులో స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసింది. ఇంటింటికీ తిరిగి, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రచారం చేస్తానని ఆమె అంటోంది. రేణుక ఎంబీఏ చదివిన విద్యావంతురాలు కావడంతో పోటీలో ఉన్న ప్రియుడు కూడా ఆందోళన చెందుతున్నారట. రేణుక మాత్రం గడపగడపకూ తిరిగి తన ప్రియుడికి బుద్ధి చెప్పి తీరుతానని హెచ్చరిస్తోంది.