పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోను!: హీరోయిన్ త్రిష
- ప్రేమించే పెళ్లి చేసుకుంటా
- కాబోయే భర్త బాగా చూసుకునేవాడై ఉండాలి
- హీరో కానవసరం లేదు.. అందంగా ఉండాల్సిన పనిలేదు
తనకు కాబోయే భర్త హీరో కానవసరం లేదని త్రిష చెప్పుకొచ్చింది. అలాగే, చాలా అందంగా ఉండాల్సిన పని లేదని తెలిపింది. మంచి వాడై ఉండాలని, తనను బాగా అర్థం చేసుకోవాలని చెప్పింది. అలాంటి వ్యక్తి తనకు పరిచయమైతే పెళ్లాడతానని తెలిపింది. ప్రస్తుతం త్రిష పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె ప్రేమలో పడిందని గతంలో చాలా వార్తలు వచ్చాయి.