'రెడ్' బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోందట
- కిషోర్ తిరుమల నుంచి 'రెడ్'
- రామ్ జోడీగా ముగ్గురు కథానాయికలు
- ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్
ఇంతకుముందు రామ్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని సాధించడం, ఈ సినిమా బిజినెస్ పై ప్రభావం చూపించిందని అంటున్నారు. అంతేకాదు .. ఈ సీజన్ లో సరైన సినిమా లేకపోవడం కూడా, ఈ స్థాయి బిజినెస్ జరగడానికి కారణమైందని చెబుతున్నారు. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో, మాళవిక శర్మ .. నివేద పేతురజ్ .. అమృత అయ్యర్ కథానాయికలుగా కనిపించనున్నారు.