'దిల్' రాజు నిర్మాణంలో విష్వక్సేన్ మూవీ
- 'హిట్'తో నటన పరంగా మంచి మార్కులు
- ఈ నెల 18న సెట్స్ పైకి కొత్త సినిమా
- దర్శకుడిగా నరేశ్ కొప్పల్లి పరిచయం
నరేశ్ వినిపించిన కథ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో, ఈ సినిమా చేయడానికి 'దిల్' రాజు అంగీకరించాడని అంటున్నారు. ఈ సినిమాకి సహనిర్మాతగా బెక్కం వేణుగోపాల్ వ్యవహరించనున్నాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును కూడా ఆరంభిస్తారట. త్వరలోనే హీరోయిన్ .. ప్రతినాయకుడు వంటి వివరాలతో పాటు మిగతా వివరాలను వెల్లడించనున్నారు.