విశాఖ ఘటనపై వైసీపీ, టీడీపీల నుంచి ఫిర్యాదులు వచ్చాయి: ఆర్కే మీనా
- విశాఖలో చంద్రబాబు పర్యటనకు అవాంతరం
- అడ్డుకున్న ఆందోళనకారులు
- ఇరుపార్టీలకు చెందినవారిపై 5 కేసులు నమోదు చేశామన్న సీపీ
- 50 మందిని అరెస్ట్ చేశామని వెల్లడి
దీనిపై సీపీ ఆర్కే మీనా స్పందిస్తూ, విశాఖ ఘటనపై వైసీపీ, టీడీపీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 151, 353, 341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇరుపార్టీలపై 5 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ ఐదు కేసుల్లో ఇప్పటిదాకా 50 మందిని అరెస్ట్ చేశామని వివరించారు.