బాలకృష్ణ అఘోర పాత్ర ప్రత్యేకత అదేనట
- విభిన్నమైన కథాంశంతో బోయపాటి మూవీ
- బాలయ్య సరసన శ్రియ - అంజలి
- అఘోర పాత్రలో కనిపించనున్న బాలయ్య
అఘోర పాత్రలో బాలకృష్ణ చేతలే తప్ప, మాటలు పెద్దగా ఉండవట. ఈ పాత్రలో చాలా వరకూ ఆయన మౌనంగానే కనిపిస్తూ తన పనులు చేసుకుంటూ వెళుతుంటాడని అంటున్నారు. అతి తక్కువ డైలాగ్స్ తో బాలకృష్ణ చేసిన పాత్ర ఇదేనని చెబుతున్నారు. ఈ పాత్ర ప్రత్యేకత ఇదేనని అంటున్నారు. ఇంతవరకూ బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి ఇది భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఆయన సరసన నాయికలుగా శ్రియ - అంజలి కనిపించనున్న సంగతి తెలిసిందే.