ట్రంప్ తో విందుకు ప్రత్యేక అతిథి వచ్చింది... ఏఆర్ రెహమాన్ పోస్ట్ చేసిన ఫన్నీ వీడియో ఇదిగో!
- ఈ వారం ప్రారంభంలో ట్రంప్ పర్యటన
- రాష్ట్రపతి విందుకు హాజరైన రెహమాన్
- ఓ కోతి వస్తే, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
అందరూ విందుకు కూర్చున్న వేళ, ఓ మర్కటం అక్కడికి వచ్చి, పూల కుండీ పక్కన కూర్చుని విందు ఆరగించింది. సదరు కోతి ఆకులను తింటుంటే, వీడియో తీసిన రెహమాన్, "ఓ చిట్టి స్నేహితుడు కూడా విందుకు వచ్చాడు" అని కామెంట్ చేస్తూ, దాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.