'ఆనందభైరవి' కోసం అంజలి, రాయ్ లక్ష్మి మధ్య ఫైట్
- షూటింగు దశలో 'ఆనందభైరవి'
- ప్రధాన పాత్రల్లో అంజలి - రాయ్ లక్ష్మి
- తెలుగు - తమిళ భాషల్లో విడుదల
కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో జరుగుతోంది. అంజలి - రాయ్ లక్ష్మి కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా యాక్షన్ సీన్స్ లో నువ్వా .. నేనా అన్నట్టుగా చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకోనున్నట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ఈ ఇద్దరి కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.