ఇంట్రెస్టింగ్ లైన్ తో బాలయ్య సినిమా.. సెట్స్ పైకి వెళుతున్న బోయపాటి
- బాలకృష్ణ హీరోగా బోయపాటి సినిమా
- నవగ్రహాల నేపథ్యంలో సాగే కథ
- 'అఘోర'గా కనిపించనున్న బాలకృష్ణ
నవగ్రహాలు .. అవి మనుషులపై చూపే ప్రభావంతో ఈ కథ సాగుతుందట. ఈ సినిమాలో వారణాసికి సంబంధించిన ఎపిసోడ్లో బాలకృష్ణ 'అఘోర'గా కూడా కనిపిస్తాడని చెబుతున్నారు. బాలకృష్ణ అఘోర లుక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వరుస పరాజయాలతో ఉన్న బాలకృష్ణ, ఈ సినిమాతో తప్పకుండా హిట్ పడాలనే పట్టుదలతో ఉన్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కనిపించే హీరోయిన్స్ ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.