పెను ప్రమాదం నుంచి బయటపడ్డ జగన్ బావ.. బ్రదర్ అనిల్ కుమార్
- జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం
- డివైడర్ పై నుంచి దూసుకెళ్లిన కారు
- హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా యాక్సిడెంట్
విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు. అనిల్ కుమార్ తో పాటు గాయపడ్డ డ్రైవర్, గన్ మెన్ ను తన కారులో విజయవాడలోని ఎంజే నాయుడు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత తన పర్యటనకు అనిల్ వెళ్లిపోయారు. జాతీయ రహదారిపై వేగాన్ని నియంత్రించేందుకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను తప్పించబోయే ప్రయత్నం చేసిన సందర్భంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.