చిరూ సినిమాలో మోహన్ బాబు .. క్లారిటీ ఇచ్చిన యూనిట్
- షూటింగు దశలో చిరంజీవి మూవీ
- ప్రత్యేక పాత్రలో మోహన్ బాబు అంటూ ప్రచారం
- కథానాయికగా త్రిష
తాజాగా ఈ విషయంపై సినిమా యూనిట్ సభ్యులు స్పందించారు. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని అన్నారు. గతంలో చిరంజీవి - మోహన్ బాబు కలిసి నటించారు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకునే అభిమానుల ఆశ .. నిరాశే అయింది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనుపించనున్నాడనే సంగతి తెలిసిందే.