'సోలో బ్రతుకే సో బెటర్' నుంచి శాంపిల్ వచ్చేస్తోంది
- సాయితేజ్ నుంచి మరో యూత్ ఫుల్ మూవీ
- దర్శకుడిగా 'సుబ్బు' పరిచయం
- కథానాయికగా నభా నటేశ్
ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 5 గంటలకు ఒక వీడియోను విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా వుంది. ఇటీవల సాయితేజ్ చేసిన 'ప్రతిరోజూ పండగే' బాగానే ఆడింది. తాజాగా చేస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' మాత్రం తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.