కేసీఆర్ కొత్త ఆలోచన... రూ. 5కే హాయిగా కూర్చుని తినేలా అన్నపూర్ణ క్యాంటీన్లు!
- ప్రస్తుతం రోడ్డుపై నిలబడి తింటున్న పేదలు
- 35 మంది కూర్చుని తినేందుకు ఏర్పాట్లు
- క్యాంటీన్లను ఆధునికీకరిస్తున్న అధికారులు
మొత్తం రూ. 8.70 లక్షల వ్యయంతో 40 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఈ సెంటర్ ను మార్చుతున్నారు. ఇక్కడ అధునాతన హంగులు ఉంటాయని, చేతులు కడుక్కునేందుకు వాష్ బేసిన్లను ఏర్పాటు చేస్తున్నామని, ఫ్యాన్ల కింద కూర్చుని, స్టీల్ ప్లేట్ లో భోజనం చేయవచ్చని అధికారులు అంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన అన్ని క్యాంటీన్లను ఆధునికీకరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.