ఐదు భాషల్లో ఏప్రిల్ 2న విడుదలవుతున్న 'నిశ్శబ్దం'
- హేమంత్ మధుకర్ నుంచి 'నిశ్శబ్దం'
- చిత్రకారిణి పాత్రలో కనిపించనున్న అనుష్క
- ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు
టీజీ విశ్వప్రసాద్ - కోన వెంకట్ కలిసి నిర్మించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే .. అవసరాల శ్రీనివాస్ .. మైఖేల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.