మెగా ఫ్యాన్స్ కు పండగే... పవన్ కల్యాణ్ సినిమాలో రేణూ దేశాయ్?
- 'పింక్' రీమేక్ స్టార్ట్ చేసిన పవన్
- ఓ పిల్లాడి తండ్రి పాత్రలో రేణూ
- గతంలో రెండు సినిమాల్లో నటించిన జంట
తాజాగా పింక్ రీమేక్ లో, ఓ కీలకమైన పాత్రను రేణూ పోషించనున్నారని సమాచారం. సినిమాలో ఓ పిల్లవాడి తల్లి పాత్రలో ఆమె కనిపిస్తారని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్, రేణూను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా, ఎన్నో ఏళ్ల తరువాత పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ కలిసి ఓ సినిమాలో నటిస్తే, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనడంలో సందేహం ఏముంది?