తుక్కుగూడ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది: టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
- ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కేసీఆర్ దాన్ని తుంగలో తొక్కారు
- ప్రజా తీర్పును టీఆర్ఎస్ అవమానించింది
- దీనికి త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు
కేసీఆర్, కేటీఆర్ పతనానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నాంది కాబోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకీ పుంజుకుంటున్న బీజేపీ ఎదుగుదలను చూడలేక కేసీఆర్ అణచివేత చర్యలకు దిగుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా మోదీ నిర్ణయాలే బీజేపీకి బలమన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు జనం తగిన బుద్ధి చెప్పారన్నారు.