ఆమని మా సినిమా ద్వారానే పరిచయమైంది: పరుచూరి గోపాలకృష్ణ
- 'ఆడది' సినిమా కోసం ఆమనిని ఎంపిక చేశాము
- 'జంబలకిడి పంబ'తో బ్రేక్ వచ్చింది
- ఆమనికి మంచి పాత్రలు పడాలన్న పరుచూరి
'ఆడది' సినిమా సమయంలోనే నేను చెప్పాను .. ఆమని పెద్ద నటి అవుతుందని. అలాగే ఆమె ఎదుగుతూ వెళ్లింది. అలాంటి ఆమని మొన్నీమధ్య ఒక సినిమాలో గ్రూపులో ఒకరిగా నిలబడి కనిపించింది. అప్పుడు మాత్రం నాకు చాలా బాధ కలిగింది. దర్శకులు మంచి పాత్రలు రాస్తే వాటికి న్యాయం చేసే సమర్థత కలిగిన తారల్లో ఆమని ఒకరు. మంచి పాత్రలను ఎంచుకుంటూ మరింత ముందుకు ఆమని వెళ్లాలని కోరుకుంటున్నట్టుగా ఆయన తన మనసులోని మాటను చెప్పారు.