నిర్మాతగా బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్!
- ప్రొడక్షన్ హౌస్ పనులను నా భర్త డేనియల్ చూస్తారు
- ఈ ఏడాది చిత్రం సెట్స్ పైకి వెళుతోంది
- నిర్మాతనని నాకు ఇగో లేదు.. టీ అందించమన్నా అందిస్తా
ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ తన భర్త డేనియల్ వెబర్ చూసుకుంటారని సన్నీ చెప్పింది. సినిమాకు కావలసిన బడ్జెట్, కథ మన అధీనంలో ఉన్నప్పుడు ఎవరినీ నిందించాల్సిన అవసరం ఉండదని సన్నీ పేర్కొంది. తమ చిత్రం ఈ ఏడాది సెట్స్ మీదకు వెళుతుందని చెబుతూ.. నిర్మాణ బాధ్యతలు కొత్త అయినప్పటికీ.. తనకు చాలా ఉత్సాహంగా ఉందంది.
ఈ సినిమాలో సందేశాలుండవని, ఇది ఒక ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పింది. ‘నిర్మాతనని నాకు ఎలాంటి ఇగో లేదు. సినిమా సెట్ లో టీ అందించమన్నా ఎలాంటి సంకోచం లేకుండా అందిస్తా. నాకు అందరూ సమానమే’ అని సన్నీ చెప్పుకొచ్చింది.