ఇల్లు అలకగానే పండుగ కాదు, తీర్మానం చేసినంత మాత్రాన మండలి రద్దయిపోదు: తులసిరెడ్డి
- సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అవివేకం
- అందుకు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు
- ఈ సీఎం అవసరమా? అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యలు
"ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చయ్యే శాసనమండలి అవసరమా అంటున్నారు. మరి, రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదించే న్యాయవాదికి రూ. 5 కోట్లు చెల్లించే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని నేను అడుతున్నా! బీసీజీ కమిటీకి ఓ నివేదిక ఇచ్చేందుకు రూ.5.95 కోట్ల ప్రజాధనాన్ని చెల్లిస్తున్న ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నా! ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు రూ.1400 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నా..!" అంటూ తులసిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.