బోయపాటి సినిమాలో సునీల్ .. ఆశలన్నీ ఈ మూవీపైనే
- సరైన పాత్ర కోసం సునీల్ వెయిటింగ్
- నిరాశ పరిచిన త్రివిక్రమ్ సినిమాల్లోని పాత్రలు
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా
ఈ నేపథ్యంలోనే 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు సునీల్ కి బాగా హెల్ప్ అవుతాయని అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకులు ఎంతమాత్రం గుర్తుపెట్టుకోనివే. తాజాగా బోయపాటి తన సినిమాలో సునీల్ కి ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణతో బోయపాటి చేయనున్న ఈ సినిమాలో సునీల్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందనే అంటున్నారు. ఈ సినిమా అయినా ఆయనను కమెడియన్ మళ్లీ నిలబెడుతుందేమో చూడాలి.