చంద్రబాబు నటన ముందు జగ్గయ్య, ప్రకాశ్ రాజ్ దిగదుడుపే: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- ఇద్దరమూ ఒకే ప్రాంతంలో పుట్టి, ఒకే చోట చదివాం
- నేను పీహెచ్డీ పూర్తి చేశా... చంద్రబాబు చేస్తూనే ఉన్నారు
- అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ప్రజలను రెచ్చగొడుతూ, తన రాజకీయ స్వలాభాలు కాపాడుకుంటూ, తన బినామీల ఆస్తులను రక్షించుకోవడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ మూడు రాజధానులను వ్యతిరేకిస్తోందని, కర్నూలులో హైకోర్టు వద్దని చంద్రబాబు బహిరంగంగా చెప్పాలని చెవిరెడ్డి సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాలకూ సమాన న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రాంతీయ విద్వేషాలను వదిలేసి, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు సహకరించాలని కోరారు.