సత్య జ్యోతి ఫిలిమ్స్ పోస్ట్ చేసిన 'హీరోయిన్ స్నేహ' వీడియోను చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు!
- దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా 'పటాస్' సినిమా
- ఇటీవల విడుదల
- గర్భిణీ అయినప్పటికీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న స్నేహ
- సాహసోపేతంగా సాధన
'అడిమురై' అనే వర్మకళ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో స్నేహ 'అడిమురై' నేర్చుకునే విద్యార్థినిగా, గురువుగా నటించారు. ఇందుకోసం ఆమె మూడు నెలలు శిక్షణ తీసుకుంది. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తర్వాతే ఆమె గర్భం దాల్చారు. అయినప్పటికీ పట్టువదలకుండా ఇంట్లోనే శిక్షణ తీసుకున్నారు. చెన్నైలోని గిండి ఫ్లైఓవర్ వద్ద పోరాట సన్నివేశంలో ఆమె అడిమురై కళను ప్రయోగిస్తారు. ఆ సమయంలో స్నేహ నాలుగు నెలల గర్భిణి. ఆ సన్నివేశాన్ని తెరకెక్కించే వరకు సినీ బృందం అంతా భయంతో వణికిపోయింది.