'తలైవి' నుంచి ఎంజీఆర్ గా అరవింద్ స్వామి ఫస్టులుక్
- షూటింగు దశలో 'తలైవి'
- జయలలిత పాత్రలో కంగన
- దర్శకుడిగా ఏఎల్ విజయ్
సినిమాల పరంగాను .. రాజకీయాల పరంగాను ఎంజీఆర్ తో కలిసి జయలలిత ఎక్కువ దూరం ప్రయాణం చేశారు. అందువలన ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్ర కూడా కీలకమే. ఈ కారణంగానే ఈ పాత్రకి అరవింద్ స్వామిని తీసుకున్నారు. ఈ రోజున ఎంజీఆర్ జయంతి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఎంజీఆర్ గా అరవిందస్వామి ఫస్టు లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో ఎంజీఆర్ ను తలపిస్తూ అరవింద్ స్వామి ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు.