సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఎంత మంచివాడవురా'
- మనుషులు .. మమతలు చుట్టూ తిరిగే కథ
- కల్యాణ్ రామ్ జోడీగా మెహ్రీన్
- ఈ నెల 15వ తేదీన భారీ విడుదల
గ్రామీణ నేపథ్యంలో సాగే కథా కథనాలతో ఈ సినిమా నిర్మితమైంది. కుటుంబం .. మనుషులు .. మమతలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కారణంగానే గట్టిపోటీ ఉన్నప్పటికీ, ఈ కథపై నమ్మకంతో ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఒక వైపున మహేశ్ బాబు .. మరో వైపున అల్లు అర్జున్ సినిమాలు భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా థియేటర్స్ కి వస్తున్న ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.