విజయ్ దేవరకొండతో జాన్వీ జోడీ కట్టడం లేదట
- పూరి తాజా ప్రాజెక్టుగా 'ఫైటర్'
- త్వరలోనే సెట్స్ పైకి విజయ్ దేవరకొండ
- డేట్స్ ఖాళీ లేవని చెప్పిన జాన్వీ కపూర్
తనకి విజయ్ దేవరకొండ స్టైల్ నచ్చుతుందనీ, ఆయనతో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే వదులుకోనని గతంలో ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ చెప్పింది. అందువలన తెరపై ఈ జోడీ కనువిందు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా వున్న కారణంగా తను ఈ సినిమా చేయడం కుదరదని జాన్వీ చెప్పిందనేది బాలీవుడ్ టాక్. ఇది విజయ్ దేవరకొండ అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. అయితే ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి వుంది.