'మహానటి' సినిమా వద్దనుకున్నా... ఆయనే ఒప్పించారు: కీర్తి సురేశ్
- నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు ఆ పాత్రను చేయలేననిపించింది
- మా మామయ్య గోవింద్ నన్ను ఒప్పించారు
- నా మీద నమ్మకం ఉంచిన నాగ్ అశ్విన్ కు థ్యాంక్స్
మొదట్లో 'మహానటి' సినిమాను వద్దనుకున్నానని కీర్తి సురేశ్ తెలిపింది. అయితే, తన మామయ్య గోవింద్ తనను ఒప్పించారని చెప్పింది. సావిత్రి పాత్రను తాను బాగా పోషించగలననే నమ్మకం మామయ్యకు ఉందని తెలిపింది. నాగ్ అశ్విన్ తనకు 'మహానటి' కథను చెప్పినప్పుడు అంత గొప్ప పాత్రను తాను పోషించలేననిపించిందని చెప్పింది. కానీ, ఆయన మాత్రం సావిత్రి పాత్రలో తనను తప్ప వేరే వాళ్లను ఊహించుకోలేకపోతున్నానని అన్నారని తెలిపింది. చివరకు ఈ చిత్రంలో నటించానని... తన మీద నమ్మకం ఉంచిన నాగ్ అశ్విన్ కు ధన్యవాదాలు చెబుతున్నానని అంది.