వచ్చే ఏడాది వెంకటేశ్ తో త్రివిక్రమ్ మూవీ
- వరుస విజయాలతో వెంకటేశ్
- త్వరలో మొదలుకానున్న 'అసురన్'
- తదుపరి సినిమా త్రివిక్రమ్ తో
ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో వెంకటేశ్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వెళుతున్నారు. మళ్లీ ఆయన మార్కెట్ పుంజుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వెంకటేశ్ తో ఒక సినిమా చేయడానికి త్రివిక్రమ్ రంగాన్ని సిద్ధం చేసే పనిలో వున్నాడట. 'అసురన్' రీమేక్ తరువాత వెంకటేశ్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.