'రూలర్'లో చాలా గ్లామరస్ గా కనిపిస్తాను: హీరోయిన్ వేదిక
తాజా ఇంటర్వ్యూలో వేదిక మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను చాలా గ్లామరస్ గా కనిపిస్తాను. అలాగే నటనకి అవకాశం వున్న పాత్ర కూడా. నా పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. తొలిసారిగా బాలకృష్ణగారితో కలిసి నటించడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సింప్లిసిటీ .. నటనపట్ల గల అంకితభావం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి" అని చెప్పుకొచ్చింది.