బండారు అప్పలనాయుడు పారిపోగా... పోలీస్ ఆఫీసర్ కుమారుడు మౌర్య దొరికిపోయాడు!
- ఈ తెల్లవారుజామున వైజాగ్ లో ప్రమాదం
- మందు కొట్టి కారు నడిపిన అప్పలనాయుడు
- పరారీలో ఉన్న అప్పలనాయుడిని పట్టుకుంటామంటున్న పోలీసులు
ఈ ఉదయం మద్యం తాగి అప్పలనాయుడు కారు నడిపిస్తుండగా, అది అదుపుతప్పి ఓ బైకర్ ను ఢీకొట్టి, ఆపై డివైడర్ ఎక్కి, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మౌర్యను అరెస్ట్ చేసిన పోలీసులు, అసలు రాత్రి ఏం జరిగిందన్న విషయమై ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.