బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేసిన వినాయక్
- మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వినాయక్
- గతంలో బాలకృష్ణ హీరోగా చేసిన 'చెన్నకేశవరెడ్డి'
- మరోసారి కలవనున్న కాంబినేషన్
'జైసింహా'కి ముందు కూడా బాలకృష్ణతో సినిమా చేయడానికి వినాయక్ సన్నాహాలు చేసుకున్నాడుగానీ, సెకండాఫ్ విషయంలో బాలయ్యను సంతృప్తి పరచలేకపోయాడు. దాంతో వరుసగా రెండు ప్రాజెక్టులు కేఎస్ రవికుమార్ చేతికి వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే సెకండాఫ్ విషయంలోనూ బాలకృష్ణను వినాయక్ మెప్పించాడని అంటున్నారు. బోయపాటి మూవీ తరువాత వినాయక్ తోనే బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.