'సరిలేరు నీకెవ్వరు' నుంచి రానున్న 'మైండ్ బ్లాక్' సాంగ్
- ముగింపు దశకి చేరుకున్న చిత్రీకరణ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
అలా ఈ రోజున మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజున సాయంత్రం 5:04 నిమిషాలకి 'మైండ్ బ్లాక్' .. అంటూ సాగే లిరికల్ సాంగ్ ను వదలనున్నారు. సోషల్ మీడియా ద్వారా విడుదలవుతున్న ఈ పాట కోసం మహేశ్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట, సోషల్ మీడియాలో కొత్త రికార్డులకు తెరతీయడం ఖాయమనే అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.