బోయపాటి సినిమాలో 'జబర్దస్త్' కమెడియన్స్
- బాలకృష్ణతో బోయపాటి మూవీకి సన్నాహాలు
- ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు
- ఏప్రిల్లో విడుదల చేయాలనే ఆలోచన
ఈ సినిమాలో కామెడీకి సంబంధించిన ఎపిసోడ్స్ కోసం, 'జబర్దస్త్' ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ ను తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి వున్నాడని అంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ చివరివారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. గతంలో బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఘన విజయాలను అందుకోవడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.