'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది
- అనిల్ రావిపూడి నుంచి 'సరిలేరు నీకెవ్వరు'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన బాణీలు కావడంతో, ఫస్టు సింగిల్ పట్ల అంతా ఆసక్తితో వున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా అనిల్ రావిపూడి ఇంతవరకూ పూర్తి వినోదభరితమైన చిత్రాలనే తెరకెక్కిస్తూ .. హిట్లు కొట్టేస్తూ వచ్చాడు. అదే తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని ఆయన చెప్పడంతో, మహేశ్ బాబు ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ చేరిపోయినట్టేనని అభిమానులు భావిస్తున్నారు.