తెలుగు రాష్ట్రాల్లో 'యాక్షన్' రెండు రోజుల వసూళ్లు
- రెండు భాషల్లో విడుదలైన 'యాక్షన్'
- తమిళంలో యావరేజ్ టాక్
- తెలుగులో ఆశించిన స్థాయిలో లేని వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 1.18 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 7.2 కోట్లకి అమ్ముడైన ఈ సినిమా, రెండు రోజుల్లో సాధించిన మొత్తం చాలా తక్కువనే చెప్పాలి. ఈ వారాంతం వరకూ వసూళ్లపరంగా ఈ సినిమా ఏ స్థాయివరకూ వెళుతుందో చూడాలి. భారీ యాక్షన్ చుట్టూ బలమైన కథను అల్లుకోకపోవడం వల్లనే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.