'యాక్షన్' సినిమా నుంచి రానా సాంగ్
- విశాల్ హీరోగా రూపొందిన 'యాక్షన్'
- తమిళ .. తెలుగు భాషల్లో విడుదల
- సంగీత దర్శకుడిగా హిపాప్ తమిజా
ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం రానా ఒక పాట పాడాడు. కొంతసేపటి క్రితం ఆ పాటను వదిలారు. 'లైట్స్ .. కెమెరా .. .యాక్షన్ .. ' అంటూ ఈ సాంగ్ సాగుతోంది. హీరో యాక్షన్ సన్నివేశాలపై ఈ సాంగ్ ప్లే అవుతూ వుంటుందనే విషయం విజువల్స్ ను బట్టి అర్థమవుతోంది. ర్యాప్ తరహాలో సాగే ఈ పాటను రానా పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే ఉద్దేశంతోనే విశాల్ పాడించాడు. హిపాప్ తమిజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, విశాల్ సరసన నాయికగా తమన్నా కనిపించనుంది.