కార్తీ కెరియర్లో ఫస్టు టైమ్ .. 100 కోట్లను కొల్లగొట్టేసిన 'ఖైదీ'
- క్రితం నెల 25న వచ్చిన విజయ్ 'విజిల్'
- కంటెంట్ పై నమ్మకంతో పోటీకి దిగిన కార్తీ
- కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిన కంటెంట్
100 కోట్ల క్లబ్ లో తన సినిమాను చూసుకోవాలనే కార్తీ కలను 'ఖైదీ' నిజం చేసింది. కెరియర్లో తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్ చూసినందుకు కార్తీ సంతోషంతో పొంగిపోతున్నాడు. విజయ్ 'విజిల్' సినిమా పోటీని తట్టుకుని కార్తీ 'ఖైదీ' ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. కంటెంట్ పై నమ్మకంతో బరిలోకి దిగిన కార్తీని ఆ కంటెంటే కాపాడిందని అంటున్నారు.